రామారావు ఆన్ డ్యూటీ కోసం 1995 బ్యాక్ డ్రాప్ ని గ్రాండ్ గా రీక్రియేట్ చేసాము – ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్

రామారావు ఆన్ డ్యూటీ కోసం 1995 బ్యాక్ డ్రాప్ ని గ్రాండ్ గా రీక్రియేట్ చేసాము – ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్

Published on Jul 20, 2022 12:30 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యువ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ తో పాటు ఇటీవల రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేరుకొని నిర్మించిన ఈ మూవీకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసారు సాహి సురేష్. ఈ మూవీకి 1995 కాలం నటి బ్యాక్ డ్రాప్ కోసం సెట్స్ ని అవుట్ డోర్ వర్క్ ని ఎంతో చక్కగా డిజైన్ చేసిన సురేష్ ఈ మూవీ గురించి తన అనుభవాలు మీడియాతో పంచుకున్నారు.

 

ఆర్ట్ డైరెక్టర్ గా మీ కెరీర్ గురించి చెప్పండి ?

కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ గారు నటించిన భైరవద్వీపం మూవీ చూసిన తరువాత అప్పట్లో ఆ మూవీలోని గ్రాండియర్ గ్రాఫిక్స్ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడి నుండి ఎలాగైనా ఆర్ట్ విభాగంలో పని చేయాలనే నా కల, అనంతరం కొన్నేళ్ళకు పరిచయస్తులు ద్వారా అదే సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన పేకేటి రంగ గారికి పరిచయం అవడంతో మొదలైంది. ఆయున దగ్గర వర్క్ చేసిన అనంతరం ఆనంద్ సాయి, అశోక్ వంటి వారి దగ్గర కూడా వర్క్ చేశాను. ఎన్టీఆర్ గారి శక్తి మూవీ కోసం ఆనంద్ సాయి గారి దగ్గర వర్క్ చేయడం చూసిన అశ్వినీదత్ గారు నాకు అనంతరం వారి బ్యానర్ లో వచ్చిన సారొచ్చారు మూవీ ఛాన్స్ ఇచ్చారు. మొదటి నుండి అనుభవం ఉన్న వారి దగ్గర వర్క్ చేయడంతో పని మీద మెల్లగా మంచి పట్టు దొరికింది. అక్కడి నుండి వెనుతిరిగి చూసుకోని నేను ఇప్పటివరకు 40 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.

 

మీ కెరీర్ లో మీకు సవాల్ గా అనిపించిన, అలానే సంతృప్తిని ఇచ్చిన సినిమాలు ఏమిటి … ?

బాలకృష్ణ గారు నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాలు ఎంతో తృప్తిని ఆనందాన్ని ఇచ్చాయి. వాటికీ ఎంతో కష్టపడడం తో పాటు ఆయా సినిమాల ఆర్ట్ వర్క్ కి ఎందరి నుండో అభినందనలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆకాశం నీహద్దరుగా డైరెక్టర్ సుధా కొంగర, ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ చూసి నా ఆర్ట్ వర్క్ ఎంతో మెచ్చుకున్నారు.

 

రామారావు ఆన్ డ్యూటీ ఆర్ట్ వర్క్ గురించి చెప్పండి ?

ఈ సినిమా ఒకరకంగా నాకు ఛాలెంజ్ అనే చెప్పాలి. కథ పరంగా 1995 సమయంలో సాగడంతో అప్పటి పరిస్థితులు, ఇళ్ళు, వాహనాలు, ఇతర వస్తువుల గురించి రీసెర్చ్ చేసి మరీ ఎంతో జాగ్రత్తగా ఆర్ట్ వర్క్ డిజైన్ చేసాము. అలానే పాటల కోసం కూడా కొన్ని సెట్స్ వేయవలసి వచ్చింది. ఇక సినిమాలో కీలకమైన ఎమ్మార్వో ఆఫీస్ సెట్ ఎంతో బాగుంటుంది, ఆ సెట్ చూస్ రవితేజ గారు ఎంతో మెచ్చుకున్నారు. అలానే ఆయన మా పనితనాన్ని ఎంతో అభినందించేవారు.

 

దర్శకడు స్టోరీ మీకు చెప్పిన తరువాత మీరు ఎటువంటి హోమ్ వర్క్ చేస్తుంటారు … ?

ముందుగా కొన్ని రెఫెరెన్స్ లు తీస్తాము, అలానే ఆయా సమయానికి సంబంధించి కొన్ని సినిమాలు చూడడంతో పాటు కథ ప్రకారం అస్లు మనకు కావలసినవి ఏంటి అనేవి ముందుగా ఆలోచిస్తాము. అనంతరం సినిమా సమయానికి అన్ని కూడా పక్కాగా నాచురల్ ఫీల్ తో ఉండేలా ప్రణాళిక చేసుకుని సెట్స్ వర్క్ లోకి దిగుతాం.

 

రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ శరత్ మండవతో మీ వర్క్ గురించి చెప్పండి ?

శరత్ కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా తనకు కావలసిన వాటిపై మంచి క్లారిటీ అలానే విజన్ ఉన్న డైరెక్టర్. ఇక సినిమాలోని పలు సీన్స్ కోసం ఒక్కో సారి ఖర్చు కూడా భారీగా అవుతుంది. అటువంటప్పుడు ప్రొడక్షన్ టీమ్ తో చర్చలు కూడా ఉంటాయి. కానీ ఈ మూవీ విషయంలో మాత్రం అటువంటివి ఏమి లేకుండా ఎక్కడా రాజీ పడకుండా దర్శకనిర్మాతలు మూవీని ఎంతో గ్రాండియర్ లుక్ వచ్చేలా తెరకెక్కించారు.

 

మీ ఆర్ట్ వర్క్ కి హీరోల నుండి ఎటువంటి అప్లాజ్ వస్తుంటుంది .. ?

బాలకృష్ణ గారు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మూవీ సెట్టింగ్స్ తో పాటు ముఖ్యంగా రామారావు గారి పాత సినిమాల సీన్స్ యొక్క రీక్రియేషన్ చూసి ఎంతగానో అభినందించారు. నాగ చైతన్య తో చేసిన మూడు సినిమాలు కూడా పెద్ద సక్సెస్ లు అయ్యాయి. నితీన్ తో భీష్మ చేశాను, ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం చేస్తున్నాను. నితిన్ గారు నన్ను ప్రతి ప్రాజక్ట్ చేయమని అడుగుతూ ఉంటారు, అది ఎంతో ఆనందాన్నిస్తుంది.

 

ప్రతి మూవీకి ఆర్ట్ డైరెక్టర్ గా కొత్తదనం చూపించడానికి ఎటువంటి ఆలోచనలు చేస్తుంటారు . ?

ముందుగా దర్శకుడు ఇన్స్పైర్ చేస్తే ఆర్ట్ డైరెక్టర్ నుండి వచ్చే ఔట్పుట్ బాగుంటుంది. ముఖ్యంగా తమ స్టోరీ విషయంలో ఆర్ట్ డైరెక్టర్ కి పక్కా క్లారిటీ ఉండేలా దర్శకుడు కనుక పక్కాగా చూసుకుంటే అనంతరం ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో పాటు కెమెరా మ్యాన్ అందరం కలిసి సినిమాకి మంచి సెట్స్, విజువల్స్ వచ్చేలా చేయవచ్చు.

 

ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ గా మార్పు వచ్చినపుడు మీ వర్క్ లో ఎటువంటి మార్పు వచ్చింది ?

నిజానికి వర్క్ లో అయితే ఎటువంటి మార్పు లేదు. ఒకసారి స్టోరీ విన్న తరువాత డ్రెస్ లు, కలర్స్, సెట్స్ డిజైనింగ్ వంటివి ప్రొడక్షన్ డిజైనర్ చూసుకుంటారు. ఇది హాలీవుడ్ లో కూడా ఉంది. తరువాత ఎవరి పార్ట్ వర్క్ వారు స్టార్ట్ చేస్తారు. మనకి ఇప్పుడిప్పుడే ఇటువంటి ట్రెండ్ మొదలైంది. ఏది ఏమైనా మనం చేసే పని మీద శ్రద్ధ పెడితే ఔట్పుట్ తప్పకుండా బాగుంటుంది.

 

దర్శకుడు ఒక సీన్ గురించి చెప్పినపుడు బడ్జెట్ డిస్కషన్స్ ఏమైనా జరుగుతాయా ?

బడ్జెట్ పరిమితులు అనేవి తప్పకుండా ఉంటాయి. ఉదాహరణకి ఒక నిమిషం పాటు ఉండే సీన్ కోసం ఒక 20 ఏళ్ళ కాలం నాటి రైల్వే స్టేషన్ సెట్ వేయాల్సి వస్తే దానిని త్వరగా ముగించేస్తాం. ఓపెన్ గా వెళ్తే బడ్జెట్ అధికం అవుతుంది. అదే సినిమాలో దాని యొక్క రన్ టైం ఎక్కువ ఉంటె అప్పుడు మనం కూడా ఓపెన్ గా చూపించడం, దానికోసం ఎక్కువగా శ్రమ పడడం జరుగుతుంది.

 

టెక్నాలజీ, సిజి వర్క్ వంటివి మీ వర్క్ పై ఏమైనా ప్రభావం చూపాయా ?

టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కడం మంచిదే. నిజానికి ఎంత టెక్నాలజీ వచ్చినా ఆర్ట్ డైరెక్టర్ పని తనకు ఎప్పుడూ ఉంటుంది. అయితే సినిమాలో సీన్స్ ప్రకారం దేనిని సిజిలో చేయాలి దేనిని రియాటిలో సెట్స్ వేయాలి అనేది ఆర్ట్ డైరెక్టర్ నిర్ణయిస్తారు.

 

మీకు ఇష్టమైన జానర్ ఏంటి ?

నాకు ఫాంటసీ సినిమాలు అంటే మొదటి నుండి ఎంతో ఇష్టం. ఎప్పటికైనా మంచి ఫాంటసీ స్టోరీ మూవీ చేయాలని కోరిక.

 

ఇక మీ తదుపరి సినిమాలు ?

మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2 , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న నితిన్, వక్కంతం వంశీ సినిమాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు