విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త రామానుజాచార్యుని జీవితం ఆధారంగా టాలీవుడ్ లో లేటెస్ట్ గా రూపొందుతున్న సినిమా జయహో రామానుజ. సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని లయన్ డా. సాయి వెంకట్ స్వీయ దర్శకత్వం వహిస్తూ నటిస్తుండగా సాయిప్రసన్న, ప్రవలిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి బి.సి. కమీషన్ ఛైర్మెన్ వకుళాభరణం కృష్ణ మోహన్ గారు, ఎఫ్ డి సి చైర్మెన్ కూర్మాచలం అనీల్ కుమార్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, సుమన్, సింగర్ పద్మ, తుమ్మల రామసత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో ముందుగా
తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ, జయహో రామానుజ సినిమా చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఈవెంట్‌కు చిన్నజీయర్ స్వామిని తీసుకువస్తే ఆయన ఇంకా బాగా చెబుతారన్నారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, సాయి వెంకట్‌కు సినిమా పట్ల అంకిత భావం ఉంది. నిర్మాతగా అతని గురించి తెలుసు. కానీ దర్శకుడిగా, ఆర్టిస్ట్‌గానూ చాలా బాగా చేశారు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, రామానుజ చరిత్ర మీద సాయి వెంకట్ సినిమా తీయడమా, అలానే ప్రపంచవ్యాప్తంగా రామానుజ కథ చెప్పాలని ప్రయత్నించడం ప్రశంసించదగ్గ విషయం అన్నారు. ఇలాంటి సినిమాని తీస్తున్న సాయి వెంకట్‌కు సపోర్ట్ చేయడం మా బాధ్యత. ఇలాంటి గొప్ప చిత్రాన్ని తీసిన సాయి వెంకట్‌కు మా కృతజ్ఞతలు తెలిపారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ, ఈ సినిమాని సాయి వెంకట్ గారు చేస్తున్నపుడు ఎలా ఉంటుందా అనిపించింది. అయితే ఫస్ట్ లుక్ చూసిన తరువాత రామానుజుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు అని అనిపించింది. అలానే ఈ సినిమాలో నేను ఢిల్లీ రాజు పాత్ర చేస్తున్నాను, సినిమా బాగా వచ్చిందన్నారు. ఇక సాయి వెంకట్ గారి కుమార్తెలను సెట్స్ లో చూసాను, అబ్బాయిల మాదిరిగా ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ఇటువంటి పాత్రలు నాకు కూడా చేయాలని ఉంటుంది, కానీ దానికి దేవుని పర్మిషన్ కావలి. నిజానికి అన్నమయ్యలో శ్రీ వేంకటేశ్వరుడి పాత్ర కోసం చాలా మందిని అడిగారు, చివరకు ఆయన ఆశీస్సులతో నాకు ఆ పాత్ర లభించడం నా అదృష్టం అన్నారు. ఇది కేవలం ఇండియా సినిమా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన మంచి కథ. తప్పకుండా అవుట్ ఫుట్ ని బట్టి చూస్తుంటే మూవీ మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని, యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు సాయి వెంకట్ మాట్లాడుతూ, ఈ మూవీని జనవరి లో ప్రారంభించి డిసెంబర్ లో పూర్తి చేసాము, సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇప్పటివరకు మాకు ఐదు గంటల వరకు సినిమా అవుట్ ఫుట్ వచ్చింది. బాహుబలి, బింబిసార సినిమాల మాదిరిగా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నిజానికి చిన్న వారు సినిమాలు చేస్తే ఇప్పట్లో ఎక్కువగా ఆదరణ లభించే పరిస్థితి లేదు. కానీ మన టాలెంట్ ని మనమే ఆడియన్స్ కి నిరూపించుకోవాలి. ఆ విధంగా మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ కి చేరువ చేసేలా ప్రయత్నాలు చేసాము. ఇప్పటివరకు రామానుజాచార్యుల వారి పై ఐదు సినిమాలు తెరకెక్కగా అందులో ఉయ్ ఒక్కటీ కూడా విడుదలకు నోచుకోలేదు. అయితే అవి ఎందుకు అలా విడుదల కాకుండా మధ్యలో నిలిచిపోయాయా అనే ఆలోచన చేశాను, ముఖ్యంగా దానికి కారణం కమర్షియల్ గా అలానే గ్రాండియర్ గా ఎలా తీయాలో ఫైనల్ గా అలాంటి కంటెంట్ సిద్ధం చేసాము. ఇక నా కూతుళ్లను అశ్వినిదత్ గారి అమ్మాయిల మాదిరిగానే ఇండస్ట్రీ కి తీసుకువచ్చాను. ఇందులో నా కూతురు నాలుగు పాత్రలు చేసింది, తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని నమ్మకం ఉంది. ఇందులో సుమారు గారు ఢిల్లీ రాజు పాత్ర చేసారు. ఇక రామానుజాచార్యుని భార్య పాత్రలో జో శర్మ అద్భుతంగా చేసారు. మా మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.
హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి వెంకట్ గారికి ప్రత్యేకంగా థాంక్స్. ఆయన దర్శకుడు, నిర్మాతగా నటుడిగా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ మూవీని అటు అమెరికాలో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా మూవీ మీ అందరి అంచనాలు అందుకుంటుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసారు.
సింగర్, నిర్మాత సాయి ప్రసన్న మాట్లాడుతూ, ఈ సినిమాలో ఒక పాటను నేను పాడాను. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత సులభం కాదు. మా డాడీ ఉండటంతో మాకు ఈ అవకాశం ఈజీగా వచ్చింది. నాకు పాట పాడే అవకాశం ఇచ్చిన మా నాన్నకు థాంక్స్’ అని, తప్పకుండా మూవీని అందరూ ఆదరించాలని కోరారు.
నిర్మాత, డైరెక్టర్, కొరియోగ్రఫర్ ప్రవళిక మాట్లాడుతూ, రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓ సీన్‌ను షూట్ చేశాం. ఉదయం నుంచి రాత్రి వరకు షూట్ చేస్తూనే ఉన్నాం. ఆ అంకిత భావాన్ని చూసి సినిమా యూనిట్ అంతా ఆశ్చర్యపోయారు. మా అమ్మ, సిస్టర్ ఇలా అందరం కలిసి సినిమా కోసం పని చేశాం. నేను ఇందులో మూడు పాత్రలు పోషించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నకు థాంక్స్. మా ఈ కష్టం తప్పకుండా మీకు రేపు థియేటర్స్ లో కనిపిస్తుంది, మూవీ మంచి సక్సెస్ అవుతుందనే నాక్కం ఉందన్నారు. అనంతరం ఇతర పలువురు అతిథులు జయహో రామానుజ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుతూ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.