మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఇప్పుడు తన గత చిత్రం “RRR” తో గ్లోబల్ లెవెల్ ఫేమ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి అలాంటి సినిమా తర్వాత తారక్ చేస్తున్న భారీ చిత్రమే “దేవర”. దర్శకుడు కొరటాల శివతో తన రెండో సినిమాగా చేసిన ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ అంచనాలు సంతరించుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ట్రైలర్ కట్ ని మేకర్స్ నిన్న రిలీజ్ చేయగా దీనికి అనూహ్య స్పందన వస్తుంది అని చెప్పాలి.
ముఖ్యంగా గ్లోబల్ ఆడియెన్స్ లో దేవర చూపించిన ఇంపాక్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. మెయిన్ గా ట్రైలర్ లాస్ట్ షాట్ సొర చేప మీద తారక్ ఒక కొరడా పట్టుకొని లేచిన చూసి వెస్ట్రన్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో పర్టిక్యులర్ గా ఈ ఒక్క షాట్ కోసం చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇలా మరోసారి తారక్ గ్లోబల్ ఆడియెన్స్ లో తన పేరు మోగేలా చేసాడు అని చెప్పాలి.
Was gonna post the entire DEVARA: PART 1 trailer, but decided *this* was the part that sells it the best where NTR Jr. (RRR) rides on the back of a great white shark that leaps out of the ocean while he whips in the moonlight. GIMME! pic.twitter.com/IrpwZRD1wW
— Courtney Howard (@Lulamaybelle) September 10, 2024
NTR IS RIDING A SHARK
WITH A WHIP
AT THE END OF THE #DevaraTrailerTHE HYPE CAN'T BE MORE REAL
WOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO pic.twitter.com/SIIEWM4CPH— Maxance Vincent (@MaxFromQuebec) September 10, 2024