సూపర్ స్టార్ తో తన ప్రాజక్ట్ పై అట్లీ ఏమన్నారంటే ?

సూపర్ స్టార్ తో తన ప్రాజక్ట్ పై అట్లీ ఏమన్నారంటే ?

Published on Nov 17, 2023 1:28 AM IST


కోలీవుడ్ యువ దర్శకుల్లో ఒకరైన అట్లీ ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ తెరకెక్కించి కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక గతంలో విజయ్, ఆర్యల తో కూడా మంచి సక్సెస్ లు తెరకెక్కించిన అట్లీ అతి త్వరలో తన నెక్స్ట్ ప్రాజక్ట్ ని అనౌన్స్ చేయనున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో మూవీ చేయడం పై అట్లీ మాట్లాడుతూ, తాను మొదటి నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి పెద్ద ఫ్యాన్ ని అని అన్నారు. ఆయన నటించిన బిగ్గెస్ట్ క్లాసిక్ మూవీ దళపతి అనంతరం రజిని గారికి పెద్ద ఫ్యాన్ అయ్యానని అన్నారు.

రజిని గారితో శంకర్ గారు తెరకెక్కించిన రోబో మూవీకి తాను అసిస్టెంట్ గా వర్క్ చేసినట్లు చెప్పారు. ఇక ఇటీవల రజిని గారితో రెండు మూడు సార్లు స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నానని అయితే అవి కొన్ని కారణాల వలన కార్యరూపం దాల్చలేదని తెలిపారు. అయితే ఖచ్చితంగా రజినీకాంత్ గారితో మూవీ చేస్తే బాషా రేంజ్ మూవీనే చేస్తారని అన్నారు. ఆయనని పీక్ రేంజ్ లో చూపించాలనేది తన కోరిక ని అన్నారు అట్లీ. కాగా సూపర్ స్టార్ రజిని గారు తనని కన్నా అని ఎంతో ఆప్యాయతతో పిలుస్తారని, అలానే తన డైరెక్షన్ లో చేయడానికి ఎప్పుడూ సిద్దమే అని రజిని గారు చెప్పారని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు