సూపర్ స్టార్ మహేష్ తో మూవీ పై సందీప్ రెడ్డి ఏమన్నారంటే ?

సూపర్ స్టార్ మహేష్ తో మూవీ పై సందీప్ రెడ్డి ఏమన్నారంటే ?

Published on Nov 25, 2023 11:09 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కెరీర్ పరంగా వరుసగా విజయాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్న మహేష్ బాబు దాని అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో తన కెరీర్ 29వ మూవీ చేయనున్నారు. ఈ సినిమాల పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇక ఇటీవల అర్జున్ రెడ్డి మూవీతో పెద్ద విజయం సొంతం చేసుకున్న యువ దర్శకడు సందీప్ రెడ్డి వంగాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మూవీ చేయనున్నారు అనే వార్తలు కొన్నేళ్ల క్రితం నుండి ప్రచారంలో ఉన్నాయి. అయితే అసలు వీరిద్దరూ కలిసి మూవీ చేస్తారా లేదా అనే దాని పై అందరిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి.

కాగా తన తాజా సినిమా యానిమల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి గతంలో ఒక స్టోరీ చెప్పానని అన్నారు. అయితే ఆ కథ ఆయనకు ఎంతో నచ్చినప్పటికీ వరుస కమిట్మెంట్స్ కారణంగా అది పట్టాలెక్కలేదని, ప్రభాస్ స్పిరిట్, అల్లు అర్జున్ మూవీస్ అనంతరం మహేష్ బాబుతో పాటు రామ్ చరణ్ తో కూడా మూవీస్ ఉంటాయని తెలిపారు సందీప్ రెడ్డి వంగా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు