అమీర్ “లాల్ సింగ్ చడ్డా” పరిస్థితి ఇలా ఉంది.!

Published on Aug 13, 2022 11:00 am IST


ఈ ఏడాది ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన బాలీవుడ్ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం “లాల్ సింగ్ చడ్డా” కూడా ఒకటి. అమీర్ ఖాన్ గతంలో ఏ సినిమాకి కూడా చేయని విధంగా ప్రమోషన్స్ ని తాను చేసాడు. హిందీ సహా తెలుగులో కూడా చాలా పర్సనల్ గా తీసుకొని చేసిన ఈ సినిమా మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించలేనట్టు తెలుస్తుంది.

మొదటి రోజు 11 కోట్లు వసూళ్లు అందుకున్న ఈ చిత్రం రెండో రోజుకి 40 శాతం డ్రాప్ ఐపోయినట్టుగా ట్రేడ్ వర్గాల వారు తెలుపుతున్నారు. దీనితో ఈ చిత్రం రెండో రోజు కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ లెక్కన అయితే ఈ సినిమా కూడా బాలీవుడ్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిపోవడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటించగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు.

సంబంధిత సమాచారం :