హిందీ లో ‘సలార్’ ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉందంటే ?

హిందీ లో ‘సలార్’ ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉందంటే ?

Published on Dec 23, 2023 12:33 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ నేడు భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరరావు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

నేడు మంచి అంచనాలతో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ అందుకున్న సలార్ అన్ని ఏరియాల్లో మంచి ఓపెవింగ్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం హిందీలో ఈ మూవీ రూ. 15 కోట్ల నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం కనపడుతోంది.

ఇటీవల ప్రభాస్ నటించిన సాహో రూ. 24 కోట్లు, రాధే శ్యామ్ రూ. 5 కోట్లు, ఆదిపురుష్ రూ. 37 కోట్ల నెట్ కలెక్షన్ దక్కించుకున్నాయి. ఓవైపు పెద్దగా ప్రమోషన్స్ చేయనప్పటికీ మరోవైపు డన్కి వంటి సినిమా కాంపిటీషన్ లో ఉన్నప్పటికి కూడా సలార్ ఈ స్థాయి ఓపెనింగ్ నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉండడం విశేషం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి రాబోయే రోజుల్లో సలార్ ఎంతమేర కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు