జైల్లో పవన్ తో ఏం మాట్లాడారు.. ఇంట్రెస్టింగ్ గా బాలయ్య, చంద్రబాబు ప్రోమో

మన తెలుగు ఓటిటి దగ్గర బిగ్గెస్ట్ హిట్ టాక్ షో ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు నటసింహం బాలయ్యతో ప్లాన్ చేసిన క్రేజీ టాక్ షో “అన్ స్టాపబుల్” అనే చెప్పాలి. మరి ఈ షో ఇపుడు నాలుగో సీజన్లోకి కూడా వచ్చేసింది. మరి సీజన్లో మొదటి ఎపిసోడ్ కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావడం హైలైట్ గా నిలిచింది.

అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ తాలూకా సాలిడ్ ప్రోమోని ఇప్పుడు ఆహా వారు వదిలారు. మరి ఈ ప్రోమో మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పాలి. అటు పాలిటిక్స్ పరంగా హాట్ ప్రశ్నలు, ఇంకోపక్క బాలయ్య చంద్రబాబు కుటుంబ సభ్యులు పరంగా మంచి ఫన్నీగా సాగింది.

అయితే ఇందులో చంద్రబాబుపై కొన్ని నెలలు కితం జరిగిన పలు కాంట్రవర్సియల్ ఘటనలు ఆ సమయంలో తాను ఎలా ఫీల్ అయ్యారు. జైలులో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రావడంతో అప్పుడు జరిగిన పరిణామాలు అలాగే అసలు ఇద్దరూ లోపల ఏం మాట్లాడుకున్నారు లాంటి ఆసక్తికర ప్రశ్నలు ఈ షోలో కనిపిస్తున్నాయి.

దీనికి చంద్రబాబు చెప్పిన సమాధానాలు ఏంటి అనేవి కూడా డెఫినెట్ గా ఆ ఫుల్ ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే. అలాగే ఈ అవైటెడ్ ఎపిసోడ్ ని ఆహా వారు ఈ అక్టోబర్ 25 రాత్రి 8 గంటల 30 నిమిషాలకి స్ట్రీమింగ్ కి తీసుకు వస్తున్నారు.

Exit mobile version