తండేల్ ఓకే.. మరి నెక్స్ట్ ఏంటి?

తండేల్ ఓకే.. మరి నెక్స్ట్ ఏంటి?

Published on Feb 13, 2025 8:59 AM IST

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పూర్తి లవ్ స్టోరీగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమాతో నాగచైతన్య తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించాడు. తండేల్ త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే, ఇప్పుడు నాగచైతన్య నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అనేది హాట్ టాపిక్‌గా మారింది. తండేల్ ఇచ్చిన బూస్ట్‌తో చైతూ తన నెక్స్ట్ మూవీని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

అంతేగాక, తండేల్ లాంటి లవ్ స్టోరీ ఏకంగా తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టినప్పుడు సరైన కథను సెలెక్ట్ చేసుకుంటే, చైతూ ఇలాంటి వసూళ్లు మున్ముందు కూడా చూడవచ్చని అభిమానులు సూచిస్తున్నారు. మరి చైతూ నుంచి ‘తండేల్’ తర్వాత నెక్స్ట్ ఏం రాబోతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు