నార్త్ లో “గేమ్ ఛేంజర్” పరిస్థితేంటి?

గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ పొలిటికల్ డ్రామాగా వస్తుంది. అయితే చరణ్ నుంచి RRR, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కాదా దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇపుడు మన తెలుగు హీరోలు హిందీ మార్కెట్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వారిలో రామ్ చరణ్ కూడా ఒకడు.

మరి చరణ్ నుంచి వస్తున్న గేమ్ ఛేంజర్ కి కూడా నార్త్ మార్కెట్ లో వసూళ్ల పట్ల ఆసక్తి నెలకొంది. మరి అక్కడ బుక్ మై షో గణాంకాల ప్రకారం ముంబై లాంటి కొన్ని మేజర్ సిటీస్ లో అలాగే పలు సింగిల్ స్క్రీన్స్ కి సంబంధించి గేమ్ ఛేంజర్ కి డీసెంట్ బుకింగ్స్ ని నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే చాలా చోట్ల సాయంత్రం షోస్ కి మంచి బుకింగ్స్ కనిపిస్తుండడం విశేషం. సో సరైన ప్రమోషన్స్ లేకపోయినప్పటికీ హిందీ మార్కెట్ నుంచి డీసెంట్ నంబర్స్ ని గేమ్ ఛేంజర్ అందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి. మరి డే 1 అక్కడ ఎలాంటి వసూళ్లు ఈ చిత్రానికి వస్తాయో చూడాలి.

Exit mobile version