“ఓజి” లో ఆ ఎపిసోడ్ పరిస్థితి ఏంటి?

“ఓజి” లో ఆ ఎపిసోడ్ పరిస్థితి ఏంటి?

Published on Sep 27, 2024 1:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈరోజే సెప్టెంబర్ 27న థియేటర్స్ లో ఉండుండేది..

మరి ఇదిలా ఉండగా పవన్ రీసెంట్ గానే సినిమా షూటింగ్ లో మళ్ళీ పాల్గొంటుండగా ప్రస్తుతం భారీ చిత్రం “హరిహర వీరమల్లు” లో పవన్ జాయిన్ అయ్యి ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక దీని తర్వాత ఓజి షూటింగ్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ కానుండడం కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్లోనే పవన్ సినిమా షూటింగ్ చేస్తుండగా భారీ సెట్స్ అయితే పవన్ కోసం మేకర్స్ అక్కడ వేశారు.

కానీ ఇప్పుడు ఓజి పై ఓ విషయంలో టెన్షన్ పడుతున్నారు. ఓజి లో బ్యాంగ్ కాక్ లో ఓ కీలక ఎపిసోడ్ పవన్ పై షూట్ చేయాల్సి ఉంది. కానీ అది చేస్తున్నారా లేదా లేక ఇక్కడే సెట్టింగ్ వేసి కానిచ్చేస్తున్నారు అనేది ఇంకా రివీల్ కావాల్సి ఉంది. పవన్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాగా దీనిని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాంటిది లొకేషన్స్ వేట చేసి కూడా అక్కడ షూటింగ్ చేయకుండా సెట్టింగ్స్ లో చేస్తే రియల్ ఫీల్ పోతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ కీలక ఎపిసోడ్ ప్లానింగ్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు