మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. చిరు నుంచి చాలా కాలం తర్వాత స్ట్రైట్ సినిమా పైగా భారీ విజువల్ వండర్ కావడంతో మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ చేస్తుండడం, విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా మళ్ళీ అప్డేట్ చేస్తుండడంతో విశ్వంభర మరింత వెనక్కి వెళ్ళింది. అయితే ఈ మే 9న కొత్త డేట్ గా సినిమా రావచ్చని వినిపించింది కానీ ఇపుడు లేటెస్ట్ గా ఈ డేట్ ని మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అధికారికంగా అనౌన్స్ చేసింది. దీనితో ఇపుడు విశ్వంభర పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. మరి విశ్వంభర ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఇక ఈ రెండు సినిమాలకీ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.