‘బన్నీ’ కోసం కనీవినీ ఎరుగని భారీ సబ్జెక్ట్ !

‘బన్నీ’ కోసం కనీవినీ ఎరుగని భారీ సబ్జెక్ట్ !

Published on Sep 16, 2024 1:00 PM IST

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ‘పుష్ప 2’కి భారీగా బజ్ ఉంది. పైగా సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ ‘పుష్ప 2’ తర్వాత ఏ సినిమా చేస్తాడు ?, ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు ? అంటూ బన్నీ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. ఈ మధ్యలో రకరకాల గ్యాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వినిపించిన పేరు అట్లీ. అట్లీ.. అల్లు అర్జున్ కలయిక దాదాపు ఫిక్స్ అని టాక్ నడిచింది.

ఐతే, ‘పుష్ప 2’ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురములో.., తర్వాత మళ్లీ మరోసారి త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. పైగా ఈ కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కనీవినీ ఎరుగని భారీ సబ్జెక్ట్ తయారు చేసారట త్రివిక్రమ్.

కాగా ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు