త్రివిక్రమ్ నుంచి మైథలాజికల్ ఎప్పుడు ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడు ప్రస్తుతం మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. అందుకే, ఫ్యాన్స్ త్రివిక్రమ్ ను కూడా ఒక మైథలాజికల్ మూవీ చేయమని పోస్ట్ లు పెడుతున్నారు. పురాణాల మీద త్రివిక్రమ్ కి మంచి పట్టు ఉంది. పైగా తన సినిమాల్లో రామాయణ, మహాభారతాలకు సంబంధించి డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే.. రామాయణంలోని ఒక భాగాన్ని, లేదా మహా భారతం లోని ఒక పార్ట్ ను తీసుకుని త్రివిక్రమ్ సినిమా చేస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే త్రివిక్రమ్ బన్నీ కోసం పవర్ ఫుల్ కథను రెడీ చేశాడట. పైగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఇక ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.

హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.

Exit mobile version