మన టాలీవుడ్ సినిమా దగ్గర ఓ హీరోని నెస్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసి అక్కడ నుంచి తన ట్రాక్ నే సెపరేట్ చేసేసే దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. తాను చేసిన సినిమాల్లో ఎన్నో భారీ హిట్స్ అయ్యినవి ఉన్నాయి అలాగే మిస్ ఫైర్ అయ్యినవి కూడా ఉన్నాయి.
మరి ఆ చిత్రాల్లో అయితే రీసెంట్ గా “లైగర్” కోసం చెప్పక్కర్లేదు. మరి దీనికి ముందు మొదటి సారి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో కలిసి చేసిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్” సెన్సేషనల్ హిట్ అయ్యింది. దీనితో లైగర్ ప్లాప్ తర్వాత అయితే మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుంది అని అయితే స్ట్రాంగ్ టాక్ మొదలైంది.
మరి టాక్ సరే ఇంతకీ ఏ సినిమా అనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉందట. దాదాపు అయితే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చిత్రమే ఉంటుంది అని అంటున్నారు. కానీ మరో పక్కా పూర్తిగా కొత్త సినిమా కూడా చేసే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ కాంబినేషన్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.