ఈసారి తెలుగులో విజయ్ టార్గెట్ పెద్దదే

ఈసారి తెలుగులో విజయ్ టార్గెట్ పెద్దదే

Published on Oct 18, 2019 2:30 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘బిగిల్’. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. తెలుగులో ఈ సినిమాను ‘విజిల్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు డబ్ బిజినెస్ బాగానే జరిగింది. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు చిత్రం బ్రేక్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ రూ.10 కోట్ల పైనే జరిగినట్టు తెలుస్తోంది.

అంటే చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.11 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు తెలుగులో విజయ్ సినిమాకు ఈ స్థాయి బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. చిత్రంపై ఉన్న బజ్, తెలుగు ట్రైలర్ క్రియేట్ చేసిన హడావుడి, సుమారు 400 థియేటర్లలో రిలీజ్ వలన సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉండే అవకాశముంది.

ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. ఏజిఎస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానయకిగా నటిస్తోంది. ఇందులో విజయ్ మూడు భిన్నమైన గెటప్స్ ట్రై చేయడం జరిగింది. ఈ నెల 25న దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు