“దేవర” లో మూడోవాడు ఎవరు?

“దేవర” లో మూడోవాడు ఎవరు?

Published on Sep 12, 2024 4:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రంలో మొదటి భాగం ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి అవైటెడ్ ట్రైలర్ కట్ ని మేకర్స్ రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ లో చాలానే ఎలిమెంట్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి.

అయితే ఈ ట్రైలర్ తో తారక్ రెండు రోల్స్ లో కనిపించనుండడం అనేది కన్ఫర్మ్ అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ ఈ ఇద్దరూ కాకుండా మూడోవాడు ఉన్నాడని పలు ఎగ్జైటింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో ఒక షాట్ స్పెషల్ గా వైరల్ అవుతుంది. దీనితో దేవరలో ఇంకో కీలక పాత్ర ఉంటుంది అని అది కూడా ఎన్టీఆర్ చేసిందే అంటూ ఓ టాక్ నడుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు