బాలయ్య బాబుకు విలన్ ఎవరు ?

Published on Jan 26, 2021 2:00 am IST

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రానున్న సినిమాలో విలన్ పాత్ర కీలకమైనది. మరి అలాంటి రోల్ కాబట్టే.. పేరు ఉన్న నటుడ్ని తీసుకోవాలని చాల రోజులు నుండి చూస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది పేర్లు వినబడ్డాయి. కానీ, ఏ ఒక్క పేరు ఫిక్స్ కాలేదట. మొదట బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ దగ్గర నుండి సునీల్ శెట్టి వరకూ, హీరో రాజశేఖర్ నుండి జగపతిబాబు వరకూ ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. ఇంతకీ బాలయ్యకి విలన్ ఎవరో ఇంకా తేలలేదు.

ఇక ఎప్పటిలాగే ఈ సినిమా కూడా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది. అందుకే ‘‘మోనార్క్‌” అనే పవర్ ఫుల్ టైటిల్ ను బాలయ్య సినిమాకి పెట్టబోతున్నారని బాగా వినిపిస్తోంది. అయితే టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో మెయిన్ గా ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్‌ తో పాటు డేంజర్ అనే టైటిల్ కూడా బాగా వినిపించింది. అయితే బాలయ్య సినిమా కథకు ఈ ‘‘మోనార్క్‌” అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి మరో సూపర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

సంబంధిత సమాచారం :