ఇంతకీ వెంకీ నెక్స్ట్ ఎవరితో ?

Published on Jun 2, 2020 11:02 pm IST


గత ఏడాది ఎఫ్2, వెంకీ మామ వంటి హిట్ చిత్రాల్లో నటించిన వెంకటేష్ ప్రస్తుతం తమిళ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చాలా వరకు చిత్రీకణ జరుపుకుంది. వెంకటేష్ మధ్య వయస్కుడైన డీగ్లామర్ రోల్ చేస్తున్నాడు. లాక్ డౌన్ అనంతరం ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది.

ఐతే వెంకీ నెక్స్ట్ మూవీ ఏమిటీ అనే దానిపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. వెంకీ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్3 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. మరో ప్రక్క పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ ఎప్పటి నుండో ఆయనతో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా వెంకటేష్ కోసం పూరి స్క్రిప్ట్ సిద్ధం చేశారని, త్వరలో సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరు దర్శకుల పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఇంతకీ వెంకీ ఎవరితో చేస్తారు అనేది సస్పెన్స్ గా ఉంది.

సంబంధిత సమాచారం :

More