“విశ్వంభర” లో ఆ ఒక్క సీన్ సీజీ కోసం 12 కోట్లు!?

“విశ్వంభర” లో ఆ ఒక్క సీన్ సీజీ కోసం 12 కోట్లు!?

Published on Aug 31, 2024 2:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం మెగా అభిమానులు అనౌన్స్ చేసిన నాటి నుంచే ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతూ వెళుతున్నాయి.

అయితే చాలా కాలం తర్వాత చిరు నుంచి ఒక భారీ చిత్రం అది కూడా ఫాంటసీ జానర్ లో వస్తున్నా సినిమా ఇది కావడంతో అంచనాలు గట్టిగా నెలకొన్నాయి. గతంలో వచ్చిన తన చిత్రాలు అంజి, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటివి ఎలాంటి మ్యాజిక్ ని చేశాయో అందరికీ తెలుసు. అందుకే విశ్వంభర పై కూడా అనేక అంచనాలు సెట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో విజువల్స్ కూడా ఆ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇలా విశ్వంభర లో కేవలం ఒక్క సీక్వెన్స్ కోసమే మేకర్స్ 12 కోట్లు పెడుతున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసమే 12 కోట్లు పెడుతున్నారట. సినిమాలో ఒక సాలిడ్ ఎపిసోడ్ ఉండగా అందులో భారీ విజువల్స్ అవసరం ఉందట. అందుకే ఇందులో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే మేకర్స్ ఏకంగా 12 కోట్లు వెచ్చిస్తున్నారు అని తెలుస్తుంది. మరి విశ్వంభర లో ఆ సీన్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు