ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి వస్తున్న వరుస లీకులు రాజమౌళిని ఇబ్బంది పెడుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ లో ఇప్పటికే దాదాపు కొన్ని కీలక సన్నివేశాలకు సంబందించిన సమాచారం బయటికి వచ్చింది. ముఖ్యంగా కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్, ఆయన పులితో ఫైట్ చేస్తున్న వీడియోలతో పాటు ఇటీవల ఎన్టీఆర్ పై తెరకెక్కించిన ఓ ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ కి సంబందించిన న్యూస్ బయటికి వచ్చింది. అనూహ్యంగా ఇప్పటివరకు వచ్చిన అన్ని లీకులు ఎన్టీఆర్ పైనే కావడం విశేషం. రామ్ చరణ్ కి సంబందించిన ఒక్క విషయం కూడా బయటికి రాలేదు.
ఇక రాజమౌళి చారిత్రాత్మక పాత్రల ఆధారంగా ఓ ఫిక్షనల్ స్టోరీ తో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు. డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీకి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ఇక అజయ్ దేవ్ గణ్ ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ జనవరి 8,2021 లో విడుదల కానుంది.