మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన పాటలు కానీ ట్యూన్స్ కానీ ఏళ్ల తరబడి శ్రోతలకు శ్రవణానందం కలిగిస్తూ వస్తున్నాయి. అయితే ఇన్నేళ్ల దేవిశ్రీ ప్రసాద్ కెరీర్లో మొదటిసారిగా ఓ సినిమాకి తన మ్యూజిక్ అది కూడా పాటలు కూడా కాదు నేపథ్య సంగీతం విషయంలో కంప్లైంట్స్ రావడం ఆశ్చర్యంగా ఉందని చెప్పాలి.
తాను లేటెస్ట్ గా చేసిన భారీ చిత్రం “కంగువా” కి తన బీట్స్ ఓవర్ గా ఉన్నాయి అని విమర్శలు బాగా వచ్చాయి. కానీ ఏ సినిమాకి ఇలాంటిది చేయని డీఎస్పీ ఈ సినిమాకి మాత్రం ఇలాంటి వర్క్ అందించడం అనేది కొత్త ప్రశ్నలకి దారి తీస్తుంది. తాను ఏమన్నా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నాడా లేక సౌండ్ మిక్సింగ్ లో సరిగా చూసుకోలేదో ఏమో కానీ ఇన్నేళ్లు ఎంతో బ్యూటిఫుల్ అండ్ క్లీన్ స్కోర్ లు అందించిన దేవిశ్రీ నుంచి ఇది మాత్రం ఊహించనిదే అని చెప్పాలి. మరి దీనిపై దేవి కారణం ఏమన్నా ఫ్యూచర్ లో రివీల్ చేస్తాడేమో చూడాలి.