ఇప్పుడు దసరా కానుకగా రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన “టైగర్ నాగేశ్వరరావు” అలాగే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన “భగవంత్ కేసరి” అలాగే మరో నోటెడ్ రిలీజ్ గా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం “లియో” కూడా ఒకటి. అయితే ఈ చిత్రాల్లో ఏయే ప్రాంతాల్లో ఎలా రెస్పాన్స్ ఉంది అని చూస్తే.
భగవంత్ కేసరి మినహా రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి. మరి ఈ చిత్రాల్లో లియో కి మన తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్ మేర తమిళ నాట ఆడియెన్స్ లో అయితే అసలు టైగర్ నాగేశ్వరరావు కోసం కానీ భగవంత్ కేసరి కోసం కానీ అంత రెస్పాన్స్ ఎక్కడా కనిపించడం లేదు.
దీనితో తమిళ్ సినిమాలకి తెలుగులో దక్కుతున్న ఆదరణ తమిళ ఆడియెన్స్ ఎందుకు తెలుగు చిత్రాలకి అక్కడ ఇవ్వలేకపోతున్నారు ఈసారి అయినా అందిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మరి ఇప్పుడు లియో కి తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న ఆదరణతో సగమైనా తమిళ ప్రేక్షకులు మన టైగర్ నాగేశ్వరరావు కి అందిస్తారో లేదో చూడాలి.