లీకయ్యిన “కల్కి” ఆ ట్రైలర్ ఇంకా ఎందుకు దాచినట్టు..?

లీకయ్యిన “కల్కి” ఆ ట్రైలర్ ఇంకా ఎందుకు దాచినట్టు..?

Published on Jun 23, 2024 7:05 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ లాంటి దిగ్గజాల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి”. మరి ఎన్నో అంచనాలు నడుమ రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు ట్రైలర్స్ వచ్చాయి.

అయితే వీటిలో మొదటి ట్రైలర్ కాకుండా మొన్న రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ వేసినపుడే లీక్ అయ్యింది. తర్వాత దీన్ని రిలీజ్ చేసేసారు. కానీ దీనికి ముందు మరో ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్ కి ముందే లీక్ అయ్యిపోయింది. అది అన్నింటి కంటే బాగా వైరల్ అయ్యింది.

కానీ ఆ ట్రైలర్ ని ఇంకా దాచి ఉంచడం గమనార్హం. మొన్న చాలా మంది అదే ట్రైలర్ వదులుతారు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ ఇంకొకటి వదిలాడు. మరి అందులో మరిన్ని సర్ప్రైజ్ లు ఉండటమే కారణం అనుకుంటా అందుకే డైరెక్ట్ థియేటర్ లోనే థ్రిల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు కాబోలు. మరి ఈ గ్యాప్ లో ఏమన్నా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు