ఓటీటీ సమీక్ష: వైఫ్ ఆఫ్ – ఈటీవీ విన్‌లో తెలుగు చిత్రం

ఓటీటీ సమీక్ష: వైఫ్ ఆఫ్ – ఈటీవీ విన్‌లో తెలుగు చిత్రం

Published on Jan 24, 2025 8:03 PM IST
Wife Off Movie Review in Telugu

విడుదల తేదీ : జనవరి 23, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ, నిఖిల్ గాజుల, సాయి స్వాతి తదితరులు

దర్శకుడు : భాను యెరుబండి

నిర్మాతలు : రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా

సంగీతం : ప్రణీత్ మ్యూజిక్

సినిమాటోగ్రఫీ : అష్కర్ అలీ

ఎడిటర్ : సాయి కృష్ణ గనల

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ‘వైఫ్ ఆఫ్’ అనే తాజా చిత్రం నేరుగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ లీడ్ రోల్స్‌లో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:

నటి కావాలని కలలు కనే అవని (దివ్య శ్రీ), అభి(అభినవ్ మణికంఠ) అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌తో ప్రేమలో పడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల తన కజిన్(నిఖిల్ గాజుల)ను అవని వివాహం చేసుకుంటుంది. అతడు అవనిని టార్చర్ చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తాడు. ఒకరోజు అవని భర్త మృతి చెందుతాడు. అయితే, అతడిది ఆత్మహత్య అని అందరూ అనుకుంటారు. దీంతో అవని అభి సాయం కోరుతుంది. అవని ఇంట్లో అసలేం జరిగింది..? అవని గతంలో ఏం చేసేది..? ఆమె భర్తకు కారణం ఎవరు..? అనే అంశాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

దివ్య శ్రీ ఈ సినిమాలో ఓ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. భర్త మన్ననలు పొందేందుకు ప్రయత్నించే భార్య పాత్రలో అవని యాక్టింగ్ బాగుంది. ఆమె తన పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది.

అభినవ్ మణికంఠ కూడా తన డ్యుయెల్ షేడ్ పాత్రను బాగా హ్యాండిల్ చేశాడు. అతని పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. బాధ్యత లేని భర్త పాత్రలో నిఖిల్ గాజుల డీసెంట్‌గా కనిపించాడు. సాయి శ్వేత తనకు ఇచ్చిన పాత్రను బాగానే చేసింది.

మైనస్ పాయింట్స్:

‘వైఫ్ ఆఫ్’ మూవీ కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. డీసెంట్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను ఎలివేట్ చేయాలని దర్శకుడు ప్రయత్నించినా.. అది ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా ఇలాంటి థ్రిల్లర్ కథకు గ్రిప్పింగ్ నెరేషన్ చాలా అవసరం. కానీ, ఈ సినిమాలో అది మిస్ అయ్యింది.

ఇలాంటి కాన్సెప్ట్ మనకు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. దీంతో ఈ సినిమాను చూసే ప్రేక్షకులు మరొక బెటర్ కథ అయితే బాగుండేది అని ఫీల్ అవుతారు. మూడు పాత్రల్లో ఈ కథను చూపించాలని సస్పెన్స్ మెయింటెయిన్ చేసిన తీరు బాగుంది. కానీ, బలమైన రైటింగ్ లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.

ఈ చిత్ర నిర్మాణ విలువలు యావరేజ్‌గా ఉండటంత, సౌండ్ డిజైన్ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఈ సినిమా ఓ యూట్యూబ్ షార్ట్ ఫిలిం మాదిరి కనిపిస్తుంది. మూవీ క్లైమాక్స్ ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, మరికొన్ని బలమైన సీన్స్ పడి ఉంటే ఈ క్లైమాక్స్ ఆసక్తికరంగా మారేది.

సాంకేతిక విభాగం:

దర్శకుడు ఈ సినిమాలోని సస్పెన్స్‌ను మెయింటెయిన్ చేయడంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు. అయితే, దాన్ని సినిమా మొత్తం క్యారీ చేయడంలో అతను విఫలమయ్యాడు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే నీట్‌గా ఉన్నప్పటికీ థ్రిల్లర్ చిత్రానికి కావాల్సిన ఇన్‌టెన్సిటీ లోపించింది. ఈ సినిమా సౌండ్ డిజైన్ సినిమాపై ఆసక్తిని నీరుగార్చేలా ఉండటం గమనార్హం. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. అనవసరమైన సీన్స్‌ను తొలగించి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు యావరేజ్‌గా ఉన్నాయి.

తీర్పు:

ఓవరాల్‌గా ‘వైఫ్ ఆఫ్’ అనే థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను బాగా డిజప్పాయింట్ చేస్తుంది. దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నా.. ఎంగేజింగ్‌గా లేని కథనం, ఆకట్టుకోలేకపోయిన టెక్నికల్ అంశాలు ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయాయి. పూర్తి స్థాయి థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారు ఈ వీకెండ్ వేరొక ఎంటర్‌టైనమెంట్ ఆప్షన్ వెత్తుకోవడం బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు