అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న లేటెస్ట్ సినిమా “తండేల్” కోసం తెలిసిందే. మరి వీరి కలయికలో ఇది రెండో సినిమా కావడం పైగా యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ సినిమా కావడంతో దీనిపై గట్టి అంచనాలు ఉన్నాయి.
అయితే ఎప్పుడు నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల దాదాపు డిసెంబర్ లోనే అన్నట్టుగా ఇప్పుడు టాక్ ఉంది కానీ మరో పక్క సంక్రాంతి రేస్ కూడా అన్నట్టు వినిపిస్తుంది. అయితే లేటెస్ట్ గా మాత్రం అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాని దాదాపు సంక్రాంతి బరిలోకే కోరుకుంటున్నారు.
అక్కినేని కుటుంబంకి ఈ మధ్య సంక్రాంతి సీజన్ బాగా కలిసి రావడంతో వారు తండేల్ ని ఎట్టి పరిస్థితిలో సంక్రాంతికి కోరుకుంటున్నారు. మరి ఇది తీరుతుందో లేదో ఒక అధికారిక క్లారిటీ రిలీజ్ పోస్టర్ తో వస్తే సరిపోతుంది. మరి ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.