టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏకంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ము లేపింది. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కింగ్‌గా పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఇదే బాటలో లేడీ పుష్పరాజ్‌గా రానుందట టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి.
అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అనుష్క చాలా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈసారి తన పంథాకు భిన్నంగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఘాటి సినిమాలో అనుష్కతో మునుపెన్నడూ చూడని విధంగా వయెలెన్స్ చేయించనున్నాడు.
అయితే, ఈ సినిమాలో అనుష్క డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి లేడీ బాస్‌గా ఎలా ఎదుగుతుంది.. ఆమెకు ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది మనకు సినిమాలో చూపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని ఘాటి చిత్రంతో అనుష్క కొనసాగిస్తుందా.. అనేది చూడాలి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.