హీరోలు సోనూ సూద్ ని కొడితే ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా?

Published on Aug 1, 2020 12:04 am IST


ప్రస్తుతం సోను సూద్ అంటే ఇండియాలో ప్రతి గల్లీ పోరడకు తెలిసిన పేరు. రెండు దశాబ్దాలుగా అనేక చిత్ర పరిశ్రమలలో సినిమాలు చేసినా రాని గుర్తింపు సోనూ సూద్, ఈ మూడు నెలలో తెచ్చుకున్నారు. వలస కార్మికులను ఇళ్లకు చేర్చిడంలో మొదలైన ఆయన సామాజిక సేవ కొనసాగుతుంది. దేశంలోని ఎవరు కష్టంలో ఉండి సాయం అడిగినా సోనూ సూద్ వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేస్తున్నాడు. సమాంతరంగా సోనూ సూద్ ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అనడంలో సందేహం లేదు.

ఐతే సోనూ సూద్ కి వచ్చిన క్రేజ్ రీత్యా ఆయనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. టాలీవుడ్ లో మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలో విలన్ పాత్రల కోసం ఆయన్ని సంప్రదిస్తున్నారట. ఐతే ఆఫ్ స్క్రీన్ లో సోనూ సూద్ ఇంత మంచివాడని తెలిశాక, అతన్ని ఆన్ స్క్రీన్ లో విలన్ గా ప్రేక్షకులు అంగీకరించరేమో అనే సందేహం వ్యక్తం అవుతుంది. సోనూ సూద్ ని హీరోలు కొడుతుంటే ప్రేక్షకుల మనసుకు బాధకలుగుతుందేమో అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More