ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందా?

ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందా?

Published on May 24, 2020 5:07 PM IST

పాశ్చత్యదేశాలలోని రియాలిటీ షోస్ ఆధారంగా ఇండియాలో రూపుదిద్దుకున్న బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్. హిందిలో దశాబ్దానికి పైగా ఈ రియాలిటీ షో నడుస్తుంది. సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలలోకి ఎంటరైన బిగ్ బాస్ ఇక్కడ కూడా ఆదరణ దక్కించుకుంది. ఇక తెలుగు బిగ్ బాస్ షో 2017నుండి ప్రసారం అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదటి సీజన్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ హోస్ట్ గా అలరించగా మొదటి సీజన్ ఆదరణ దక్కించుకొంది.

ఆ తరువాత నాని, గత ఏడాది నాగార్జున ఈ షో వ్యాఖ్యాతలుగా ఉన్నారు. కాగా ఈ ఏడాది బిగ్ బాస్ షో నిర్వహణ కష్టమే అన్న అభిప్రాయం వినిపిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఇలాంటి తరుణంలో ఓ ఇంటిలో కొందరు సెలెబ్రిటీలను ఉంచడం అంత శ్రేయస్కరం కాదని నిర్వాహకులు భావిస్తున్నారట. తగు జాగ్రత్తలతో షో నిర్వహించాలని చూసినా, గవర్నమెంట్స్ అనుమతులు ఇవ్వకపోవచ్చు.

ఇక బిగ్ బాస్ షో లో ఆసక్తికరమైన ఫిజికల్ టాస్క్ లు ఉంటాయి. కరోనా కారణంగా అలాంటి ఫిజికల్ టాస్క్ లు లేకుండా షో నిర్వహిస్తే అందులో కిక్కు ఉండదు. ఇన్ని అవాంతరాల నడుమ ఈ షో నిర్వహణ కష్టమే అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు