స్టార్ హీరో బెయిల్ పరిస్థితేంటి ?

హీరో దర్శన్‌ కేసుకు సంబంధించి వాదనలు ముగిశాయి, తీర్పు రిజర్వ్ లో ఉంచారు, నేడు హియరింగ్ జరగబోతుంది. ఇంతకీ, ఏం జరగనుంది ?, దర్శన్ కు బెయిల్ వస్తుందా ?, రాదా ?.. ఇదే అతని అభిమానుల్లో రగులుతున్న ప్రశ్న. మరోవేపు మరికొన్ని రోజులు దర్శన్ జైళ్లోనే ఉండాల్సి వస్తుందని ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరగబోతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. హీరోయిన్ పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ స్టార్ హీరో దర్శన్‌ అరెస్ట్ అయ్యారు.

ఐతే, అరెస్టయిన దర్శన్‌ కు కచ్చితంగా బెయిల్ వస్తుందని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. కానీ, దర్శన్‌ కు బెయిల్ మాత్రం రాలేదు. దీంతో, దర్శన్ అభిమానులకు నిరాశ ఎదురు అవుతూనే ఉంది. మరోవైపు జైల్లో అతనికి రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. పైగా ఆ మధ్య ఓ ఫోటో కూడా లీక్ అయ్యింది. అన్నట్టు, ఈ హత్య కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఏ-15, ఏ-16, ఏ-17కు ఇప్పటికే బెయిల్ రావడం జరిగింది. దర్శన్ ఏ-2గా ఉన్నాడు కాబట్టి, బెయిల్ వస్తోందా ? రాదా ? అనేది ఈ రోజు సాయంత్రం లోపు క్లారిటీ రానుంది.

Exit mobile version