‘డబుల్ ఇస్మార్ట్’తో వారికి భారీ నష్టాలు తప్పవా..?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ తరహా బ్లాక్‌బస్టర్ హిట్ కావడం ఖాయమని అందరూ భావించారు.

కట్ చేస్తే.. ఈ సినిమాకు తొలిరోజే మిక్సిడ్ టాక్ రావడం.. బాక్సాఫీస్ దగ్గర ఇతర సినిమాలు పోటీలో ఉండటంతో డబుల్ ఇస్మార్ట్ యావరేజ్‌గా స్టార్ట్ అయ్యింది. అయితే, వీకెండ్‌లో కూడా ఈ సినిమాపై ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపకపోవడం.. సినిమాకు నెగెటివ్ రివ్యూలు ఎక్కువగా రావడంతో.. ఈ మూవీ ఇప్పుడు డిజాస్టర్ దిశగా వెళ్తుందని సినీ క్రిటిక్స్ అంటున్నారు. అంతేగాక, ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల విషయంలోనూ చాలా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది.

ఈ సినిమాను ప్రముఖ బ్యానర్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ ధరకు కొనుగోలు చేశారు. అయితే, ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టోటల్ రన్ ముగించుకోనుందని.. ఇది పూరి గత చిత్రం ‘లైగర్’ కంటే కూడా తక్కువ కలెక్షన్స్ రాబట్టిందని.. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కి భారీ నష్టాలను మిగుల్చనుందని క్రిటిక్స్ చెబుతున్నారు. ఏదేమైనా ‘డబుల్ ఇస్మార్ట్’పై పూరి అండ్ టీమ్ పెట్టుకున్న ఆశలు ఆశలు గానే మిగిలిపోయాయని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version