“మార్కో” ట్రైలర్.. కేరళ వెర్షన్ “కిల్” తెలుగులో వర్కౌట్ అవుతుందా?

సాలిడ్ కంటెంట్ ని మంచి అవుట్ పుట్ తో అందించడంలో మళయాళ సినిమా ఎప్పుడు ముందుంటుందని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ లో కూడా సాలిడ్ సబ్జెక్టు లని మలయాళ సినిమా వారు అందిస్తారు. అలానే ఈ ఏడాది మంచి హిట్స్ ని అందించి రీసెంట్ గా కూడా ఓ సెన్సేషనల్ వైలెంట్ హిట్ ని అందించారు. మరి ఆ చిత్రమే “మార్కో”.

టాలెంటెడ్ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ని పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేసినప్పటికీ ముందు మలయాళంలో మాత్రమే రిలీజ్ అయ్యింది. కానీ అక్కడ సాలిడ్ టాక్ ని తెచ్చుకొని ఇతర భాషల్లో కూడా మాట్లాడుకునేలా చేసింది. దీనితో తెలుగులో వారం గ్యాప్ లోనే మేకర్స్ తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత చాలా బాలీవుడ్ క్రేజీ వైలెంట్ హిట్ చిత్రం “కిల్” సినిమాతో పోల్చడం స్టార్ట్ చేశారు. కిల్ రేంజ్ లో ఉందని కొందరు, కిల్ కంటే ఎక్కువే ఉందని కొందరు అంటున్నారు. ఇలా కేరళ వెర్షన్ కిల్ అనిపిస్తున్న ఈ సినిమా నుంచి తెలుగులో పాత ట్రైలర్ నే మళ్ళీ రిలీజ్ చేశారు.

అయితే అప్పుడు కంటే ఇప్పుడు మరింతమందికి ఈ సినిమా కోసం తెలిసింది కానీ తెలుగు ఆడియెన్స్ లో కిల్ సినిమా కోసం కూడా తెలుసు. అయితే మార్కో ట్రైలర్ లో కూడా కిల్ సినిమా తరహాలో మనకి ఇష్టమైన వాళ్ళని మన ముందే చంపెయ్యడం అనే లాంటి డైలాగ్స్ కిల్ తో మ్యాచ్ అవుతున్నాయి.

మిగతా టేకింగ్ గా డిఫరెంట్ గానే ఉంది కానీ సబ్జెక్టు ఒకేలా ఉంటే తెలుగులో వర్కౌట్ అవుతుందో లేదో అనేది చూడాలి మరి. కిల్ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు కానీ ఓటిటిలో వచ్చాక బాగానే చూసారు. మరి చూడాలి మార్కో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది. ఈ చిత్రం తెలుగులో జనవరి 1న రిలీజ్ కాబోతుంది.

Exit mobile version