మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ లో అఖిల్ అక్కినేని అలాగే శ్రీలీల కూడా ఒకరు. మరి ఇద్దరూ కూడా కెరీర్ స్టార్టింగ్ నుంచే సాలిడ్ ప్రాజెక్ట్ లు చేస్తూ వచ్చారు. ఇలా ఫైనల్ గా ఈ యువ ఒక సినిమా కోసం ఏకం అయ్యారు. మరి ఆ చిత్రం “లెనిన్”. దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ తో మంచి హైప్ ఇపుడు సెట్ అయ్యింది.
అయితే అఖిల్, శ్రీలీల కాంబినేషన్ ఈ చిత్రానికి చాలా ఇంట్రెస్టింగ్ కలయిక అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాక ఈ ఇద్దరు హీరో హీరోయిన్స్ పరిస్థితి కూడా దాదాపు ఒకలానే కొనసాగుతూ వచ్చింది. ఇలా వరుస పరాభవాలు తర్వాత ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయడం అనేది ఇద్దరి కెరీర్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మరి ఇలా చేస్తున్న ఈ సినిమాతోనే అఖిల్, శ్రీలీలలు తమకి కావాల్సిన రీసౌండింగ్ సూపర్ హిట్ ని అందుకుంటారా లేదా అనేది చూడాలి. మరి లెనిన్ ఈ బ్రేక్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.