RC16 కోసం ఫస్ట్ షూట్ చేసేది అదేనా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీని దర్శకుడు బుచ్చిబాబు సానాతో స్టార్ట్ చేశాడు.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు తెరకెక్కించనున్నాడు. కాగా, ఈ సినిమాలో చరణ్ లుక్ కూడా కొత్తగా ఉండనుందట. అయితే, ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్ ఇప్పటికే మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన ఇప్పటికే నాలుగు పాటలకు మ్యూజిక్ కంప్లీట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్‌లో ఓ సాంగ్‌ని షూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version