‘సీఎం’ను రేపు లేదా ఎల్లుండి కలుస్తాం – దిల్ రాజు

‘సీఎం’ను రేపు లేదా ఎల్లుండి కలుస్తాం – దిల్ రాజు

Published on Dec 24, 2024 11:01 PM IST

‘పుష్ప 2’ సినిమాని చూడటానికి వచ్చి, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ పై రిలీజ్ అవ్వడం మొత్తానికి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే, ఈ విషయం పై కొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయం పై స్పందించారు.

చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను దిల్ రాజు ఈరోజు పరామర్శించారు. ‘సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం అని, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి అని, ప్రస్తుతం అతను రికవర్ అవుతున్నాడని, రానున్న రోజుల్లో అతడి తండ్రికి సినీ పరిశ్రమలో ఏదైనా ఉద్యోగం కల్పిస్తాం అని, అలాగే, వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం’ అని దిల్ రాజు తెలిపారు. అదే విధంగా సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ కోరామని, రేపు లేదా ఎల్లుండి ఆయన్ను కలుస్తామని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌తోనూ సమావేశమవుతాను అని దిల్ రాజు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు