కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ నా సామిరంగ. ఈ మూవీలో రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రలు చేయగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకి వస్తుండడంతో తప్పకుండా మూవీ సెన్సేషనల్ సక్సెస్ అందుకుంటుందని నాగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. తొలిసారిగా దర్శకుడిగా మెగా ఫోన్ పడుతున్న దర్శకుడు విజయ్ బిన్నీ పై తాజాగా ఒక ట్వీట్ ద్వారా హీరో నాగార్జున ప్రసంశలు కురిపించారు.
తప్పకుండా నా సామిరంగ మూవీ మంచి అంచనాలు అందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తాజాగా రిలీజ్ అయిన హను మాన్, గుంటూరు కారం సైంధవ్ మూడు కూడా మంచి టాక్ తో కొనసాగుతుండడంతో నాగ్ కూడా హిట్ కొట్టే అవకాశం కనపడుతోందని, మాస్ యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ అంశాలు కూడా నా సామిరంగ మూవీలో అదిరిపోనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.