హాట్ టాపిక్: “సరిపోదా శనివారం” తో నాని ఆ ఫీట్ సాధిస్తాడా?

హాట్ టాపిక్: “సరిపోదా శనివారం” తో నాని ఆ ఫీట్ సాధిస్తాడా?

Published on Aug 27, 2024 2:28 AM IST


తెలుగు సినీ పరిశ్రమలో డిఫెరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ, ఎప్పటికప్పుడు వైవిధ్యం కనబరుస్తూ చేసే నటుడు నాచురల్ స్టార్ నాని. గతేడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో రెండు సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ ఏడాది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ఈ ఆగస్టు 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని.

దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం మంచి హైప్ ను సొంతం చేసుకుంది. సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు, ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచాయి. నాని కూడా సినిమాను అన్ని చోట్లా ప్రమోట్ చేస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించాడు.

నాని ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల షేర్ చిత్రాన్ని అందించలేదు. కొంతమంది స్టార్ హీరోలు మాత్రమే అందుకున్న ఈ రేర్ ఫీట్ ను, ఈ సరిపోదా శనివారం చిత్రంతో నాని సాధిస్తాడా లేదా అనేది తెలియాలి. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. డే 1 నాని కెరీర్ లోనే అత్యధికం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, లాంగ్ రన్ లో భారీ వసూళ్లు ఖాయం. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు