న్యాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘సరిపోదా శనివారం’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ప్రస్తుతం నాని ‘హిట్-3’ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అయితే, నాని ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్‌లో నటించబోతున్నాడా అని అంటే.. సినీ సర్కిల్స్‌లో అవుననే మాట వినిపిస్తోంది. ఫీల్ గుడ్ చిత్రాలకు కేరాఫ్ అయిన దర్శకుడు శేఖర్ కమ్ములతో నాని త్వరలోనే ఓ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘కుబేర’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల, మరో క్రేజీ కథను రెడీ చేశాడట. ఈ కథకు ధనుష్ ఓకే చెబితే ఆయనతో.. ఒకవేళ ధనుష్ కాదంటే నానితో చేయాలని శేఖర్ కమ్ముల ఫిక్స్ అయ్యాడట.
దీంతో త్వరలోనే ‘కుబేర’ సినిమాను ముగించి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టేందుకు ఈ వెర్సటైల్ డైరెక్టర్ రెడీ అవుతున్నాడట. ఇక మరో విషయం ఏమిటంటే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా సాయి పల్లవిని తీసుకోవాలని ఈ డైరెక్టర్ అనుకుంటున్నాడు. మరి నిజంగానే శేఖర్ కమ్ముల – నాని లాంటి క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి.