‘కోర్ట్’లో నాని ఆ టాపిక్‌ను టచ్ చేస్తాడా..?


న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హిట్-3’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ మూవీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేయనున్న సంగతి తెలిసిందే. అటు నిర్మాతగా కూడా నాని ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. నటుడు ప్రియదర్శి మెయిన్ లీడ్‌లో ‘కోర్ట్’ అనే చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నాడు.

కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జగదీశ్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ సెన్సేషనల్ టాపిక్‌ను టచ్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టు రుమ్‌లో పోక్సో చట్టాన్ని టచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పోక్సో చట్టంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లోనూ ఈ కేసు కారణంగా ఓ సెలబ్రిటీ జైలు పాలయ్యాడు.

మరి నిజంగానే ‘కోర్ట్’లో పోక్సో చట్టంపై చర్చ జరుగుతుందా… నాని నిజంగానే ఈ సెన్సేషనల్ టాపిక్‌ని సినిమాలో లేవనెత్తుతాడా..? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version