కెజిఎఫ్ డైరెక్టర్ బర్త్ డే..ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్

కెజిఎఫ్ డైరెక్టర్ బర్త్ డే..ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్

Published on Jun 4, 2020 8:21 AM IST

నేడు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు. ఐతే ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అంశం ఏమిటీ? అంటే వీరిద్దరి మూవీపై అప్డేట్ కాకపోయినా ఏదైనా హింట్ వస్తుందేమో అని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే కి ప్రశాంత్ నీల్ ట్విట్టర్ వేదికగా ఆయన్ని విష్ చేశారు. ఆయన ట్వీట్ పరోక్షంగా ఎన్టీఆర్ తో మూవీ ఉందన్నట్టు ఉంది. కానీ ఆ తరువాత ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఎన్టీఆర్ తో ఆయన మూవీ చేస్తున్నారా లేదా అనే అనుమానం కలిగించింది.

నేడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ చెప్పడం ఖాయం. దీనితో ఎన్టీఆర్ ఏదైనా హింట్ ఇస్తాడేమో అనే ఆలోచనలో ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే వీరి కాంబినేషన్ లో చిత్రం నిర్మించ దలచిన మైత్రి మూవీ మేకర్స్ ఏదైనా బర్త్ డే విషెష్ పోస్టర్ విడుదల చేయవచ్చు. చూద్దాం మరి ప్రశాంత్ నీల్ బర్త్ డే రోజు ఎన్టీఆర్ మూవీపై ఏదైనా హింట్ వస్తుందో లేదో..!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు