తన లాస్ట్ రీమేక్ ని “భీమ్లా నాయక్” తో క్రాస్ చేస్తాడా?

తన లాస్ట్ రీమేక్ ని “భీమ్లా నాయక్” తో క్రాస్ చేస్తాడా?

Published on May 8, 2022 3:39 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా అందుకున్న మాసివ్ హిట్ సినిమా అయినటువంటి “భీమ్లా నాయక్” కోసం తెలిసిందే. మళయాళ సూపర్ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా రానా మరో హీరోగా దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాదిలో భారీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా వెండితెరపై సక్సెస్ అయ్యింది. ఇక ఈరోజు ఫైనల్ గా బుల్లితెర మీదకి వస్తుంది.

స్టార్ మా ఛానెల్లో ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతుంది. అయితే మన బిగ్ స్టార్స్ సినిమాలు వస్తున్నాయి అంటే ఫస్ట్ టైం టెలికాస్ట్ పై మంచి అంచనాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు భీమ్లా నాయక్ పై కూడా ఉన్నాయి. అయితే దీనికి ముందు పవన్ నటించిన “వకీల్ సాబ్” మంచి రికార్డు టీఆర్పీ ని నమోదు చేసింది. మరి ఈ సినిమా దానికన్నా పెద్ద హిట్టు.. సో ఈ సినిమా దానిని క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు