ఈసారైనా ‘పుష్ప’ రాజ్ బంటు లెక్కలు మారుస్తాడా?

ఈసారైనా ‘పుష్ప’ రాజ్ బంటు లెక్కలు మారుస్తాడా?

Published on Apr 14, 2025 12:07 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక్క బాక్సాఫీస్ దగ్గరే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఇంతేనా ఓటిటిలు టీవీ లలో కూడా అల్లు అర్జున్ కి ఉన్న ఆదరణ అనన్య సామాన్యం. చాలా తక్కువమందికి మాత్రమే ఇలాంటి రీచ్ ఉంటుంది అని చెప్పవచ్చు. మెయిన్ గా తన సినిమాలు అన్నిటికి బుల్లితెరపై గట్టి ఆదరణ రిపీట్ వాల్యూ కూడా ఉంది.

ఇలానే తన గత రెండు సినిమాలు కూడా తెలుగు స్మాల్ స్క్రీన్ పై భారీ టీఆర్పీ రికార్డులు సెట్ చేసాయి. అయితే తెలుగులో అల వైకుంఠపురములో చిత్రం 29 కి పైగా టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ తో ఆల్ టైం నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అయితే దీనిని పుష్ప 1 బ్రేక్ చేయలేకపోయింది. దీనికి కేవలం 25 టీఆర్పీ పాయింట్స్ వచ్చాయి. కానీ ఇపుడు పుష్ప 2 వరల్డ్ ఈవిజన్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో టెలికాస్ట్ కి వచ్చింది. మరి ఈసారి అయినా పుష్ప రాజ్ బంటు గాని లెక్కలు మార్చి కొత్త రికార్డులు సెట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు