ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు అందుకొని చరిత్ర సృష్టించింది.
అయితే సుసాధ్యం అనుకున్న బాహుబలి 2 వసూళ్ళని బ్రేక్ చెయ్యలేదు ఏమో అనుకున్న ఈ సినిమా దానిని బ్రేక్ చేసి ఇపుడు 1900 కోట్ల గ్రాస్ దిశగా వెళుతుంది. కానీ లేటెస్ట్ గా మేకర్స్ మరో 20 నిమిషాల రన్ టైం ని యాడ్ చేసి ఈ జనవరి 11 నుంచి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే కొత్త కంటెంట్ కావడంతో ఇది మళ్ళీ సినిమాకి ప్లస్ అవుతుంది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
అలాగే మరో 100 కోట్లు దీనితో వస్తాయని నమ్ముతున్నారు. మరి అదనంగా చేర్చిన ఈ 20 నిమిషాలు పుష్ప 2 ని 2000 కోట్ల క్లబ్ లో చేరుస్తాయా అంటే కొంచెం డౌటే అని చెప్పాలి. మొత్తం మూడు కొత్త సినిమాలు ఇపుడు వస్తున్నాయి. మేజర్ గా థియేటర్స్ లో ఇవే ఉండొచ్చు. సో పుష్ప 2 మరో 100 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే మళ్ళీ మ్యాజిక్ చెయ్యాల్సిందే అని చెప్పాలి. మరి చూడాలి పుష్ప 2 ఆ 2000 కోట్ల మార్క్ ని కూడా అందుకుంటుందా లేదా అనేది.