‘జీ5’లో ‘రొమాంటిక్’.. నిజమేనా ?

Published on Nov 29, 2020 10:33 pm IST

ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న ‘రొమాంటిక్’ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుందట. కాగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జీ5 నుండి ఈ సినిమా మంచి ఆఫర్ వచ్చిందని.. జీ5 లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా రమ్యకృష్ణ ఆకాష్ పూరికి అత్త పాత్రలో నటిస్తోందట. ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కుతుంది. ఇక హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More