మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లుగా మార్చేసిన సినిమా “రౌద్రం రణం రుధిరం”. మరి ఈ సినిమా తోనే దర్శకుడు రాజమౌళి కూడా గ్లోబల్ దర్శకుడు అయ్యారు. అయితే గ్లోబల్ వైడ్ గా RRR సినిమా ఎలాంటి ఫీట్ ని అందుకుందో అందరికీ తెలుసు.
మరి ఈ నేపథ్యంలో మేకర్స్ లేటెస్ట్ గా “RRR – బిహైండ్ & బియాండ్” అంటూ ఓ కొత్త డాక్యుమెంటరీని అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా దీనికి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు కానీ దీనిని ఓటిటిలలో కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో ఇక్కడ నుంచే చాలా ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇది చూసేందుకు డాక్యుమెంటరీలా ఉంది అలాంటప్పుడు యూట్యూబ్ లోనో అంతకీ కాదు అంటే రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ లో ప్లాన్ చేసిన డాక్యుమెంటరీ లానే అందులో ఇవ్వాల్సింది అని భావిస్తున్నారు. దీనితో పాటుగా మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే అసలు ఇది థియేటర్స్ లో వర్క్ అవుతుందా అనేది? ఈ డాక్యు చిత్రం కేవలం ఇంగ్లీష్ లోనే కనిపిస్తుంది.
కనీసం తెలుగులో కానీ హిందీలో కానీ లేదు. దీనితో ఒక్క ఇంగ్లీష్ లోనే దేశ వ్యాప్తంగా రిలీజ్ చేస్తారా? ఒరిజినల్ తెలుగు లేదా డబ్బింగ్ హిందీ లాంటివి ఉన్నాయా అనే క్లారిటీ కూడా లేదు. దీనితో సామాన్య ఆడియెన్స్ కి ఇది థియేటర్స్ లో ఎంతవరకు అలరిస్తుంది. సో థియేటర్స్ లో ఇది వర్కౌట్ అవుతుందా అనేది కూడా చూడాలి. ఇలా ఈ డాక్యు చిత్రం థియేటర్స్ లోకి వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.