దసరాకు ‘విశ్వంభర’ ట్రీట్ ఉంటుందా లేదా..?

దసరాకు ‘విశ్వంభర’ ట్రీట్ ఉంటుందా లేదా..?

Published on Oct 9, 2024 4:46 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ముగించుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ పూర్తి సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందా అని అభిమానులు ఎంతో ఆస్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా నుండి మెగాస్టార్ బర్త్‌డే కానుకగా ఆగస్టు 22న ఓ టీజర్ వస్తుందని అందరూ భావించారు. కానీ, ఆ సమయానికి టీజర్ కట్ పర్ఫెక్ట్‌గా లేకపోవడంతో ఓ పోస్టర్‌తోనే అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు దసరా పండుగ వస్తుండటంతో, ఈసారైనా టీజర్ ట్రీట్ ఉంటుందా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. అయితే, ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సినీ సర్కి్ల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కట్ రెడీగా ఉందని, కేవలం చిరు ఓకే చెబితే దసరా కానుకగా ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి దసరా పండుగకు ‘విశ్వంభర’ ట్రీట్ ఉంటుందా లేదా.. అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు