‘క‌ల్కి’ లో బిగ్ స‌ర్ ప్రైజ్ ఉండ‌నుందా..?

‘క‌ల్కి’ లో బిగ్ స‌ర్ ప్రైజ్ ఉండ‌నుందా..?

Published on Jun 26, 2024 11:33 AM IST

పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ‘క‌ల్కి 2898 AD’ మూవీ జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ పూర్తి సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో తెర‌కెక్కించిన తీరు అత్య‌ద్భుంగా ఉండ‌బోతుంద‌ని ఆడియెన్స్ ఇప్ప‌టికే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ ‘భైర‌వ’ పాత్ర‌లో బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇవ్వ‌నున్నాడ‌ని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో చాలా స‌ర్ ప్రైజ్ లు ఉండ‌బోతున్న‌ట్లుగా చిత్ర వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది

ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండ‌నుంద‌ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే వెల్ల‌డించింది. వారితో పాటు ప‌లు పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసే విధంగా ఉండ‌నున్నాయట‌. వీటిలో శ్రీ‌కృష్ణుడి పాత్ర కూడా ఉండనుంద‌ట‌. అయితే, ఈ పాత్ర‌ను వీఎఫ్ఎక్స్ తో తీర్చిదిద్దార‌ని.. ఈ పాత్ర‌లో లెజెండ‌రీ యాక్ట‌ర్ నంద‌మూరి తార‌క‌రామారావు క‌నిపించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ లోగోలోనూ శ్రీ‌కృష్ణుడిగా ఎన్టీఆర్ క‌నిపిస్తారు.

ఇప్పుడు ‘క‌ల్కి’ సినిమాలోనూ మ‌రోసారి శ్రీ‌కృష్ణుడిగా ఎన్టీఆర్ క‌నిపిస్తార‌నే టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి నిజంగానే ‘క‌ల్కి’ మూవీలో ఈ బిగ్ స‌ర్ ప్రైజ్ ఉంటుందా అనేది రేపు సినిమా రిలీజ్ అయితే తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు