క‌ల్కి-2 లో ఈ మార్పు చేస్తారా..?

క‌ల్కి-2 లో ఈ మార్పు చేస్తారా..?

Published on Jun 30, 2024 2:00 AM IST

ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి 2898 AD బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళ్తోంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సినిమాకు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఫిదా అవుతుండ‌టంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది క‌ల్కి. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెండో పార్ట్ పై కూడా భారీగా అంచ‌నాలు క్రియేట్ అవుతున్నాయి.

అయితే, క‌ల్కి-2 కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. క‌ల్కి-2 సినిమాలో కొన్ని మార్పులు చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. కల్కి మూవీకి పాజిటివిటీ ఎక్కువ‌గానే ఉన్నా.. ఈ సినిమా మ్యూజిక్ విష‌యంలో మాత్రం ఎందుకో అభిమానులు సంతృప్తి చెంద‌లేద‌ట‌. దీనికి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతమే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. దీంతో క‌ల్కి-2 మూవీలో సంతోష్ నారాయ‌ణ‌న్ ప్లేస్ లో వేరొక మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంద‌ట‌.

దీని కోసం ఎంఎం.కీర‌వాణి పేరును చిత్ర యూనిట్ ప‌రిశీలిస్తున్న‌ట్లుగా వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. అయితే, కీరవాణి ప్ర‌స్తుతం రాజ‌మౌళి-మ‌హేష్ బాబు సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్త‌యితేనే ఆయ‌న ఫ్రీ అవుతారు. మ‌రి అప్ప‌టివ‌ర‌కు క‌ల్కి-2 మేక‌ర్స్ వెయిట్ చేస్తారా, లేక సంతోష్ నారాయ‌ణ‌న్ తోనే కానిచ్చేస్తారా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు