అఖిల్ కి ఈ ఫార్ములా హిట్టిస్తుందా?

అక్కినేని వారి హీరోస్ కి సరైన హిట్స్ లేనప్పటికీ అఖిల్ స్టార్డం వేరని చెప్పొచ్చు. గత సినిమా ఎలా ఉన్నా తన నెక్స్ట్ సినిమాకి మంచి బిజినెస్ ని అఖిల్ సినిమా చేస్తుంది. అదే అఖిల్ స్పెషాలిటీ. కానీ తన హార్డ్ వర్క్ కి తగ్గ హిట్ మాత్రం తనకి ఇంకా అందని ద్రాక్ష గానే మారింది. అయితే ఒక సాలిడ్ హిట్ కోసం తాను కొంచెం గ్యాప్ తీసుకొనే “లెనిన్” గా వస్తున్నాడు.

అయితే ఈసారి మాత్రం అఖిల్ గట్టిగానే కొట్టేలా ఉన్నాడని ఈ టైటిల్ గ్లింప్స్ సహా తన లుక్స్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే వీటితో ఇటీవల టాలీవుడ్ లో హిట్ అయ్యిన ఫార్ములా తనకి హిట్ ఇస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ మధ్య కాలంలో మన హీరోస్ డీగ్లామర్ గా మారి చేసిన సినిమాలు అన్నీ దాదాపు హిట్ అయ్యాయి.

పుష్ప, నాని దసరా, రీసెంట్ గానే అఖిల్ అన్న నాగ చైతన్య నటించిన తండేల్ ఇలా చాలా సినిమాలు చూస్తున్నా మన హీరోలు డీగ్లామ్ లుక్ లోకి మారి వింటేజ్ సినిమాలతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ ని కొట్టారు. ఇంట్రెస్టింగ్ గా ఈ అన్ని సినిమాల్లో కూడా హీరోలు పొడవాటి శిరోజాలు, గడ్డం లోనే కనిపించారు. మరి ఇపుడు లెనిన్ లో అఖిల్ కూడా ఇదే తరహా లుక్స్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ ఫార్ములా అఖిల్ కి కూడా భారీ హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి మరి.

Exit mobile version