బాలయ్య సినిమాలో ఆ హీరో విలన్‌గా నటిస్తాడా..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర ప్రేక్షకులను స్టన్ చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంకా మేకర్స్ ఫిక్స్ చేయలేదు. అయితే, బాలయ్యను ఢీకొట్టేందుకు ఇప్పుడు ఓ హీరో రెడీ అవుతున్నాడనే వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీని దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా కోసం బోయపాటి తనదైన స్టైల్‌లో కథను రెడీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుందని.. దీని కోసం ఓ పవర్‌ఫుల్ హీరోను విలన్‌గా తీసుకొచ్చేందుకు బోయపాటి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ హీరో మరెవరో కాదు.. మ్యాచో స్టార్ గోపీచంద్ అని తెలుస్తోంది. ‘జయం’, ‘నిజం’ వంటి సినిమాల్లో విలన్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ మ్యాచో స్టార్ ఇప్పుడు మరోసారి విలన్‌గా మారబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. బాలయ్యతో విలన్‌గా గోపీచంద్ ఢీకొంటే చూడాలని ఇద్దరు హీరోల అభిమానులు కోరుతున్నారు.

Exit mobile version